అడవి తునికి పండ్లకు భలే గిరాకీ..!!
దిశ,ఉట్నూర్: ప్రతి రోజు మార్కెట్లో రసాయనలతో పెంచిన పండ్లను తిన్నవారు ఖచ్చితంగా సహజ సిద్ధంగా పండిన పండ్లను ఇష్టపడుతుంటారు. అడవిలో దొరికే తునికి పండ్లంటే మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఉట్నూరు మండలంలోని గూడ అడవిలో దొరికే తునికి పండ్లను అమ్ముతున్న మహిళలకు గిరాకీ బాగానే పెరిగింది. గిరిజన మహిళలు ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి తునికి పండ్లను సేకరించి అమ్ముతుంటారు. అయితే సంవత్సరానికి ఒక్కసారి ఉండే గిరాకీ, రోజు రోజుకు పెరగడంతో రోజూ అడవికి […]
దిశ,ఉట్నూర్: ప్రతి రోజు మార్కెట్లో రసాయనలతో పెంచిన పండ్లను తిన్నవారు ఖచ్చితంగా సహజ సిద్ధంగా పండిన పండ్లను ఇష్టపడుతుంటారు. అడవిలో దొరికే తునికి పండ్లంటే మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఉట్నూరు మండలంలోని గూడ అడవిలో దొరికే తునికి పండ్లను అమ్ముతున్న మహిళలకు గిరాకీ బాగానే పెరిగింది. గిరిజన మహిళలు ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్లి తునికి పండ్లను సేకరించి అమ్ముతుంటారు. అయితే సంవత్సరానికి ఒక్కసారి ఉండే గిరాకీ, రోజు రోజుకు పెరగడంతో రోజూ అడవికి వెళ్లి పండ్లు సేకరించి విక్రయిస్తున్నారు. ఈ పండ్ల ధర కిలో రూ.100 పెట్టిన గిరాకీ తగ్గకపోవడం గమనార్హం.