ఆదివాసీ నాయకపోడు ఎన్నారై కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

దిశ, ఆర్మూర్: ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం అనుబంధ ఎన్నారై కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ వివరాలను ఎన్నారై కమిటీ అధ్యక్షుడు పెంకుల రాజేశ్వర్ సోమవారం ‘దిశ’కు వివరించారు. ఎన్నారై కమిటీలో వివిధ దేశాల తరఫున పలువురు నాయకపోడులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. పలు దేశాల్లో ఉద్యోగ, ఉపాధి పొందుతున్న నాయకపోడు కార్మికుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నవారి వివరాలను పరిశీలిస్తే.. ఎన్నారై వింగ్ అధ్యక్షుడిగా పెంకుల రాజేశ్వర్, ఇరాక్ అధ్యక్షుడిగా సుర్బిర్యాల మధు, ఉపాధ్యక్షుడిగా కర్క […]

Update: 2021-12-13 07:05 GMT

దిశ, ఆర్మూర్: ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం అనుబంధ ఎన్నారై కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ వివరాలను ఎన్నారై కమిటీ అధ్యక్షుడు పెంకుల రాజేశ్వర్ సోమవారం ‘దిశ’కు వివరించారు. ఎన్నారై కమిటీలో వివిధ దేశాల తరఫున పలువురు నాయకపోడులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. పలు దేశాల్లో ఉద్యోగ, ఉపాధి పొందుతున్న నాయకపోడు కార్మికుల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నవారి వివరాలను పరిశీలిస్తే.. ఎన్నారై వింగ్ అధ్యక్షుడిగా పెంకుల రాజేశ్వర్, ఇరాక్ అధ్యక్షుడిగా సుర్బిర్యాల మధు, ఉపాధ్యక్షుడిగా కర్క రాజేశ్వర్, దుబాయ్ అధ్యక్షుడిగా మూడ మహేశ్, ఉపాధ్యక్షుడిగా కొట్టాల గంగన్న, ఒమన్ అధ్యక్షుడిగా రాజశేఖర్, మస్కట్ అధ్యక్షుడిగా అడిగెం అశోక్, బహ్రెయిన్ అధ్యక్షుడిగా మద్దికుంట మహేశ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో పలు సమస్యలు ఎదురయ్యే కార్మికుల పక్షాన తమ ఎంఆర్ఐ కమిటీ పోరాడుతుందని తెలిపారు. నకిలీ ఏజెంట్లు, ఫ్రాడ్ కంపెనీల మోసాలు తదితర కష్టాల్లో కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్నారై కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులతోపాటు జాతీయ, రాష్ట్ర, మండల కమిటీల బాధ్యులు అభినందించారు.

Tags:    

Similar News