ఇక రైళ్లలోనూ జొమాటో.. ఐఆర్‌సీటీసీతో ఒప్పందం
ఇండియన్ రైల్వే అధునాతన సౌకర్యాలతో రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.
దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ రైల్వే అధునాతన సౌకర్యాలతో రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో రైళ్లలో ప్రయాణించే వారు ప్రీ బుకింగ్ చేసుకున్న ఆహార పదార్థాలను సేర్వ్ చేసేందుకు గాను ఐఆర్‌సీటీసీ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ విప్లవాత్మక సదుపాయాన్ని కేవలం ఐదు స్టేషన్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్ సేవల ద్వారా ప్రయాణికులు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే, ఆ ఆహారాన్ని జొమాటో సాయంతో ఆయా స్టేషన్లలోని ప్రయాణికులకు అందజేస్తారు. ఒకవేళ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, మరిన్ని స్టేషన్లకూ విస్తరించే అవకాశం లేకపోలేదు.