Viral video : వైరల్ అయ్యేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటం! యూట్యూబర్ అరెస్ట్
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు వికృత చేష్టలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు వికృత చేష్టలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యూట్యూబర్ రైల్వే ట్రాక్లపై వరుసగా రాళ్లు, గ్యాస్ సిలిండర్, సైకిల్, ఓ పెద్ద డబ్బా లాంటివి ఉంచి.. రైలు వాటిపై నుంచి వెళ్తే ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు. అయితే అతను రైలు వచ్చే ప్రతీ సారి డిఫరెంట్ వస్తువు రైల్వే ట్రాక్ పై పెడుతున్నట్లు అతని యూట్యూబ్ వీడియోలో కన్పిస్తుంది.
కాగా, బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా యూట్యూబర్ వీడియోలను సంబంధిత రైల్వే అధికారులకు పోస్ట్ చేశారు. రైల్వే ప్రమాదాలు సృష్టించే ఈ దేశ వ్యతిరేకులను గుర్తించండి. కాగితాలతో సిగ్నల్స్ కప్పడం, ట్రాక్‌లపై ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వల్ల విధ్వంసక ఘటనలు చాలా జరిగాయని పేర్కొన్నారు. గుల్జార్ షేక్ అనే యూట్యూబర్ చేసే పనులు చూడండి.. ఇలాంటి దుశ్చర్యలతో రైళ్లు ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంటుందని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొట్టడంతో అధికారులు స్పందించారు. ఈ క్రమంలోనే ప్రయాగ్‌రాజ్ పోలీసులు యూట్యూబర్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.