వీల్‌చైర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తున్న యువతి (వీడియో)
ఆకలిగా అనిపించినా, బయటకు వెళ్లడానికి బద్దకంగా ఉన్న ఎవరైనా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటుంటారు. అలాంటి వారికి ఫుడ్ డెలీవరి బాయ్స్, గర్ల్స్ చాలా హెల్ప్ అవుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆకలిగా అనిపించినా, బయటకు వెళ్లడానికి బద్దకంగా ఉన్న ఎవరైనా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటుంటారు. అలాంటి వారికి ఫుడ్ డెలీవరి బాయ్స్, గర్ల్స్ చాలా హెల్ప్ అవుతుంటారు. అయితే, ఆర్డర్ చేసిన ఎవరూ డెలివరీ చేసేవాళ్ల కష్టాల గురించి పట్టించుకోరు, వాళ్లకు ఫుడ్ వచ్చిందా? లేదా? అనేది మాత్రమే చూస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక, సర్కార్ నోటిఫికేషన్ వేయకపోవడం మూలంగా అనేకమంది ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా మారారు. వీరు పడుతున్న ఇబ్బందులను కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తుంటారు. అయితే, తాజాగా.. ఓ యువతి ఫుడ్ డెలివరీ చేయడం అందరినీ కలచివేస్తోంది. హ్యాండి క్యాపుడ్ యువతి ఎలక్ట్రిక్ వీల్‌చైర్‌లో వచ్చి మరీ పుడ్ డెలివరీ చేస్తోంది. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ ఫర్ ఉమెన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివార్ ట్విట్టర్ పోస్ట్ చేశారు. 'లైఫ్ కష్టం.. ఓటమిని అంగీకరించడం నేర్చుకున్నాం! ఈ స్ఫూర్తికి వందనం అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె కృషికి సెల్యూట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గణేష్ విగ్రహాన్ని కౌగిలించుకుని ఏడుస్తోన్న చిన్నారి (వీడియో)