Viral Video: పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు ఇచ్చిన భార్య.. మండపంలో ఉన్న బంధువులంతా షాక్

గత కొంత కాలం నుంచి విడాకులు న్యూస్ లు రోజు రోజుకు పెరుగిపోతున్నాయి.

Update: 2024-07-24 07:05 GMT

దిశ, ఫీచర్స్: గత కొంత కాలం నుంచి విడాకులు న్యూస్ లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు డివోర్స్ తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి చేసుకునే ముందు ప్రేమ గానే ఉంటున్నారు చేసుకున్న తర్వాత అసలైన సినిమా చూపిస్తున్నారు. కొద్దీ రోజులకే ఇద్దరిలో ఉన్న నెగిటివ్స్ బయటపడటంతో సర్దుకుపోవడానికి ఇష్టపడటం లేదు. గొడవలు పడి విడిపోవడమే కరెక్ట్ అంటూ డివోర్స్ తీసుకుని సింగిల్ గా బతుకుతున్నారు.

ఈ మధ్య కాలంలో హార్దిక్ పాండ్య , దుబాయ్ యువరాణి, సానియా మీర్జా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది వీరు విడాకులు ఇచ్చి ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా ఇలాంటి వార్తే నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఓ యువతి పెళ్లైన 3 నిమిషాల్లోనే చేసుకున్న కళ్యాణ మండపంలోనే భర్తకు డివోర్స్ ఇచ్చింది.

పెళ్లి కూతురుని మండపానికి తీసుకువస్తున్న సమయంలో ఆమెను చీర పై వరుడు బంధువులు మొత్తం కామెంట్స్ చేసారు. ఆ సమయంలో వరుడు ఏమి మాట్లాడకపోవడంతో వేదనకి గురైన ఆ యువతి.. అదే మండపంలో పెళ్లైన మూడు నిమిషాలకే డివోర్స్ ఇచ్చింది. ఇది చూసి బంధువులంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం, ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 

Tags:    

Similar News