ఏం నాయనా.. అంబానీ ఇంట్లో ఉద్యోగం కావాలా.? అయితే కావాల్సిన అర్హతలివే.. జీతం ఏకంగా లక్షల్లోనే..

రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-08-17 07:02 GMT

దిశ, ఫీచర్స్: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఈరోజు అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ముకేశ్ అంబానీ.. వరల్డ్‌లోనే టాప్-10 ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా నెట్టింట హాట్ టాపికే అవుతుంది అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వారి ఇంట్లో పనిచేసే వారికి ఎంత జీతం ఇస్తారు.? అందుకు కావాల్సిన అర్హతలేమిటి..? వారి జీవన విధానం ఎలా ఉంటుంది..? ఇలాంటి సందేహాలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ముఖేష్ అంబానీ నివసిస్తున్న ఇంటి పేరు యాంటీలియా. దీనిని 2010లో పూర్తి చేయగా.. ప్రజెంట్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందుతుంది. దీనిని ఎంత స్ట్రాంగ్‌గా నిర్మించారంటే.. రిక్టర్ స్కేల్‌లో 8 తీవ్రత చూపించిన కూడా ఈ భవనం చెక్కుచదరదట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎంత ఆడంబరంగా నిర్మించారు అనేది. అయితే బేసిక్‌గా అంబాని ఇల్లును చూసుకోవడం అంత ఈజీ కాదు. కేవలం ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది సుమారు 600 మంది వరకు ఉంటారు. మరి అందులో వంట చేసే వారి వేతనం నెలకు రూ.2 లక్షలుగా ఉంటుందట. పైగా వారికి పలురకాల ఇంటర్వ్యూలు, టెస్టులు ఉంటాయని.. అవి క్వాలిఫై అయితేనే వారిని తీసుకుంటారని తెలిసింది.

సాధారణంగా అంబానీ ఇంట్లో వంట చేయాలంటే మినిమమ్ డిగ్రీ లేదంటే డిప్లమో ఉండాలట. ఇకపోతే, వన్స్‌ ఇక్కడ ఉద్యోగం వచ్చిందంటే.. వారి దశ తిరిగినట్టే అంటున్నారు కొందరు మీడియా వర్గాలు. ఎందుకంటే ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి రాయల్ సౌకర్యాలతో పాటు.. ఉండడానికి ప్రైవేట్ రూమ్ కేటాయిస్తారు. అంతేకాదండోయ్.. ఆంటిలియాలో పనిచేసే సిబ్బందికి భారీ జీతం లభిస్తుందట. అందులో భాగంగా ఆ ఇంట్లో పనిచేసే స్వీపర్లు కూడా నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నారట. ఈ జీతంతో పాటు వైద్య, విద్యా భత్యం కూడా ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags:    

Similar News