Viral: ఇదెక్కడి మాస్‌ రా మావా!.. భర్తను వదిలేసి మరీ కోడలిని పెళ్లి చేసుకున్న అత్త..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.

Update: 2024-08-13 08:24 GMT

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం షాక్‌కు గురి చేసేలా ఉంటాయి.అయితే బేసిక్‌గా పెళ్లి అంటే అమ్మాయి అబ్బాయి చేసుకుంటారు. కానీ, మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారుతూ గత కొద్ది కాలంగా వివాహ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వలింగ వివాహాలు పెరుగుతున్నాయి. సమాజంలో వీటికి ఆమోదం లేకపోయినా సరే.. కొందరు మాత్రం ధైర్యం చేసి మరీ ఇలాంటి బంధంలోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా ఇదే తరహాకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కోడలిపై మనసు పారేసుకున్న అత్త.. ఆమెని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా భర్తను వదిలేసి మరీ వచ్చింది. ఆ తర్వాత కోడలిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి వార్త, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బీహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లోని కుచాయికోట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామానికి చెందిన మహిళకు అప్పటికే వివాహం అయ్యింది. భర్తతో కలిసి కాపురం చేసుకుంటుంది. అంతా సజావుగా సాగుతుందని భావిస్తుండగా.. అనుకోని ట్విస్ట్ చోటుచేసుకుంది. అత్త తన మేనకోడలిపై మనసు పడింది. ఈ విషయాన్ని ఆమెకు కూడా చెప్పింది. ఇక కోడలు కూడా ఓకే చెప్పడంతో ఇక గత మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలిపోయారు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఈ అత్తాకోడళ్ల ప్రేమను అంగీకరించలేదు. కానీ, ఎలాగైనా సరే.. కలిసి జీవించాలని భావించిన అత్తాకోడళ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అత్తా, కోడలు కుటుంబ సభ్యులు, బంధువులను కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ససముసాలోని దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అలాగే హిందూ సాంప్రదాయాల ప్రకారం దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య మేనకోడలి మెడలో అత్త తాళి కట్టేసింది. ఆ తర్వాత అగ్ని గుండం చుట్టూ ఏడడుగులు వేస్తూ.. ప్రాణాలు పోయే వరకు తాము ఇద్దరం కలిసే ఉంటామని ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఈ అత్తాకోడళ్ల పెళ్లికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు వీరి పెళ్లిని స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తూ ఏకిపారేస్తున్నారు.

Tags:    

Similar News