Viral: పిల్ల, పిల్లగాడి లగ్గానికి వచ్చిపోతే మా మనస్సు నిమ్మలమైతది.. తెలంగాణ యాసలో వైరల్ అవుతున్న పెళ్లి కార్డు

ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల వెడ్డింగ్ కార్డులు వైరల్ అవుతున్నాయి.

Update: 2024-08-17 03:07 GMT

దిశ, ఫీచర్స్: ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల వెడ్డింగ్ కార్డులు వైరల్ అవుతున్నాయి. గతంలో పెళ్లి కార్డులకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతుండే.. కానీ మారుతున్న కాలాను గుణంగా అన్ని స్పెషల్‌గా ఉండాలని వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అయితే అవి అంతే విధంగా ఆకట్టుకోవడం విశేషం. సాధారణంగా 90's లో ఉన్నప్పుడు మనం దాదాపు ఒకే రకమైన వెడ్డింగ్ కార్డును చూసి ఉంటాము. కానీ, ఇప్పుడు అలా కాదు మొబైల్ వెడ్డింగ్ కార్డ్ అని, పాస్‌పోర్ట్ వెడ్డింగ్ కార్డ్, బంగారంతో వెడ్డింగ్ కార్డ్, కూరగాయలతో వెడ్డింగ్ కార్డ్ ఇలా రకరకాలుగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో తెలంగాణ యాసతో తయారు చేయబడిన వెడ్డింగ్ కార్డ్ ఒకటి చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా పెళ్లి కార్డుల్లో అచ్చమైన తెలుగుతో పాటు గ్రాంధికం, సంస్కృతం ఉంటుంది. వివాహం జరిగే తేదీ, చిరునామా, నవ వధూవరుల పేర్లు, బంధువుల పేర్లు ఇలా అన్ని కలగలిపి పెళ్లి పత్రికను ముద్రిస్తారు. అయితే తెలంగాణలోని కరీనంగర్‌ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం విభిన్న రీతిలో తమ ఇంటి పెళ్లి వేడుక కార్డును ప్రింట్ చేయించింది. మొత్తం తెలంగాణ యాసలోనే ఈ పెళ్లి పత్రికను తయారు చేయించింది. అందులో ఈ విధంగా ప్రింట్ చేయించారు.

“స్వర్గంలో ఉన్న ప్రేమగల మా బాపమ్మ – తాత నిండు దీవెనార్తెలతో మా ఒక్కగానొక్క పిల్లగాడు చి. మధు లగ్గం చి.ల.సౌ పల్లవితో చేసేందుకు అటోళ్లు ఇటోళ్లు ఖాయం చేసిర్రు. అందురూ జెర యాది మరిచిపోకుర్రి. అసలేరు వానలు ఉన్నాయని రాకుండా ఉండేరు.. జెర యాల్ల పొద్దుగాల్ల వచ్చి మా పిల్ల పిల్లగానికి మీ దీవెనలిచ్చి మా లగ్గం సంబురం చూసి పోతే మా మనస్సు నిమ్మలమైతది. ఇట్లు లగ్గానికి పిలిసేటోళ్లు.. అరుసుకునేటోళ్లు”.. అంటూ ఇలా అచ్చ తెలంగాణ యాసను పెళ్లి పత్రికలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు మీ వినూత్న ఆలోచనకు మేము ఫిదా అయ్యాము.. గుడ్ ఐడియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పెళ్లి పత్రికను చూసేయ్యండి.


Tags:    

Similar News