Viral Video: ఈ టీచర్ పాఠాలు చెబితే ఈజీగా అర్ధమవుతాయి.. ఖుష్భూ మేడమ్ పై ప్రశంసలు

ఈ టీచర్ పాఠాలు భోదిస్తే పిల్లలకు సులభంగా అర్ధమవుతాయి.

Update: 2024-08-11 12:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ టీచర్ పాఠాలు భోదిస్తే పిల్లలకు సులభంగా అర్ధమవుతాయి. అంతేగాక ఈ టీచర్ క్లాస్ కోసం పిల్లలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. బీహర్ కు చెందిన మహిళ టీచర్ విద్యార్ధులకు పాఠాలు చెప్పే విధానానికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బంకాలోని కటోరియల్ ప్రభుత్వ పాఠశాలలో కుష్బూ ఆనంద్ అనే మహిళ టీచర్ పిల్లలకు డిఫరెంట్ గా పాఠాలు బోధిస్తుంది. క్లాస్ లో పిల్లలతో మమేకమై డ్యాన్స్ చేస్తూ పాఠాలు బోధిస్తుంది. దీంతో మేడమ్ ఏం చెప్పినా వారికి సులభంగా అర్ధం అవుతుంది. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే పిల్లలు కూడా ఎంతో ఆనందగా స్కూల్ వస్తుంటారు. ఖుష్భూ మేడమ్ క్లాస్ కోసం ఎదురు చూస్తుంటారు.

నిజానికి స్కూల్ కి రాని పిల్లలకు విద్యపై ఆసక్తిని పెంచేందుకు టీచర్లకు చహాక్ అనే ప్రోగ్రామ్ ద్వారా శిక్షణను ఇస్తుంటారు. దీంతో ఉపాద్యాయులు పిల్లల ఇళ్లకు వెళ్లి విద్యపై అవగాహన కల్పించి పాఠశాలకు తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తారు. ఇందులో భాగంగానే ఖుష్భూ టీచర్ పిల్లలకు ఆసక్తికలిగేలా ప్రత్యేకంగా డ్యాన్స్ తో పాఠాలు బోధిస్తుంది. ఈ వీడియోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటోంది. ఇందులో ఓ వీడియోపై పిల్లలకు అవగాహాన పెంపొందించాలంటే కొన్ని సార్లు మనం కూడా పిల్లల్లా మారాల్సి ఉంటుందని రాసుకొచ్చింది. ఈ వీడియోలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా ప్రత్యేకంగా పాఠాలు చెబితే స్కూళ్లు ఖాళీగా ఉండవని చెబుతున్నారు.


Tags:    

Similar News