Viral Video: మా నాన్నను జైల్లో వేయండి!.. పోలీస్స్టేషన్ కు ఐదేళ్ల బాలుడు
నన్ను రోజు కొడుతున్నాడు.. మా నాన్నను జైల్లో వేయండి అంటూ ఐదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: నన్ను రోజు కొడుతున్నాడు.. మా నాన్నను జైల్లో వేయండి అంటూ ఐదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ధార్ జిల్లాలో హసనైన్ అనే ఐదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా.. తన తండ్రి ఇక్బా్ల్ పై ఫిర్యాదు చేయడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. ఎందుకు కేసు పెడుతున్నావని అడగటంతో ఆ బాలుడు ఏడుస్తూ తన తండ్రి రోజూ కొడుతున్నాడని, తన ఇంటి దగ్గర ఉన్న నది వద్దకు పోనివ్వడం లేదని, రోడ్డు వైపు వెళ్లొద్దని వారిస్తున్నాడని క్యూట్ గా చెప్పాడు.
తన రిపోర్టు రాసి తన తండ్రిని జైళ్లో బందించాలని కోరాడు. దీనికి ఆ పోలీస్ అధికారి స్పందిస్తూ.. ఇక్బాల్ పై రిపోర్ట్ రాసుకున్నానని, అతన్ని తీసుకొచ్చి బంధిస్తామని హామీ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ నుంచి బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెనుదిరిగాడు. ఈ సంఘటనను ఓ అధికారి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. చిన్నారి ధైర్యానికి ఫిధా అయినా నెటిజన్లు.. ఈ పిల్లాడి క్యూట్ కంప్లైంట్ తీసుకోండి సర్ అని స్పందిస్తుండగా.. ఓ నెటిజన్ మనం అతన్ని చిన్నపిల్లాడిలా చూస్తున్నాం కానీ తనకి అఘాయిత్యం జరిగితే ఫిర్యాదు చేయాలి అని అవగాహన ఉన్న దేశ పౌరుడు అని ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు.