VIRAL VIDEO: జుట్లు పట్టుకొని పొట్టు పొట్టున కొట్టుకున్న అమ్మాయిలు..! వైరల్ అవుతున్న వీడియో
మారుతున్న కాలానుగుణంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
దిశ, ఫీచర్స్: మారుతున్న కాలానుగుణంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలా ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు ఇల్లు పిల్లలు అని ఇంటిని చక్క పెడుతున్నారు. ఒకప్పుడు వంటిల్లుకే పరిమితం అయిన ఆడది.. ఈ రోజు సమాజంలో కూడా ధీటుగా రాణిస్తున్నది. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ క్రమంలో ప్రస్తుతం ఇద్దరు ఆడవాళ్ళు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.
బేసిక్‌గా గొవడ విషయంలో అబ్బాయిలు ముందుంటారు. అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటూ.. వేరే దగ్గర గొడవ జరుగుతున్న చూసి భయపడుతుంటారు. కానీ, ఇక్కడ మాత్రం మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. @gharkekalesh అనే పేరుతో X హ్యాండిల్‌లో పోస్ట్ అయిన వీడియో ప్రకారం.. అమ్మాయిలు స్కూల్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతలో ఎదురుగా నిలబడిన ఓ అమ్మాయి మరో అమ్మాయి బ్యాగ్‌ని చెక్ చేయడం ప్రారంభించింది. దీనిపై ఆ యువతి అభ్యంతరం చెబుతోంది. దీంతో కోపంతో ఆ యువతి ఆకుపచ్చ టీషర్ట్‌లో నిల్చుని అవతలి యువతి ముఖంపై కొట్టి, చేయి కూడా మెలికలు తిప్పేస్తుంది. దీంతో మనస్తాపానికి గురైన అవతలి అమ్మాయి.. ఆకుపచ్చ టీషర్ట్‌లో ఉన్న అమ్మాయిని చెంప ఛెళ్లుమనేలా కొట్టింది.
అయితే వీడియోలో ఉన్న మూడో అమ్మాయి వారిద్దరని విడిపీయడానికి ఎంతగానో ట్రై చేసింది కానీ, వారు ఆమెను పట్టించుకోకుండా ఫైటింగ్ చేయడంలో బిజీ అయిపోయారు. కాగా వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అన్న దానికి మాత్రం కారణం తెలియలేదు. ఈ తతంగం మొత్తం చూస్తున్న ఓ నెటిజన్.. తన ఫోన్లో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు అంతరించి పోతున్న కళను మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అని.. ఎవరి కోసం ఫైట్ చేసుకుంటున్నారని.. గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి చాలా డేంజర్‌గా ఉందని తెగ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Kalesh b/w School Girls on Road
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 17, 2024
📹 Source: Reddit
pic.twitter.com/LMZvniV62O
( video link credits @gharkekalesh X account )