ఎన్నికల సిత్రాలు! గాడిదలపై EVM మిషన్స్ తరలింపు
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. మొదటి దశ పోలింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి మొదలైంది. మొదటి దశ పోలింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశ పొలింగ్‌లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వాహణ సిబ్బంది ఈవీఎం మిషన్స్‌తో పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు. అయితే ఈవీఎం మిషన్స్ కార్లు, బస్సులు, విమానాలు, హెలికాప్టర్లు లాంటి వాహనాల్లో తీసుకపోవడం చూసి ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఎన్నికల అధికారులు ఈవీఎం మిషన్స్ ఓ పోలింగ్ కేంద్రానికి తరలించారు. తమిళనాడు- దిండిగల్ జిల్లాలోని నాథమ్ ప్రాంతంలోని గ్రామాలకు గాడిదలను ఉపయోగించి ఈవీఎం మిషన్స్‌ను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మామూలుగా గాడిదలపై బట్టలు, ఇతర సామాన్లు తీసుకువెళ్తారు. కానీ గాడిదలపై ఈవీఎం మిషన్స్ తరలించడం నెటిజన్లు చూసి అవాక్కయ్యారు. ద్రావిడ మోడల్ అని చెప్పుకునే రాష్ట్రంలో కనీసం గ్రామాల్లో రోడ్ల సౌకర్యం కూడా కల్పించలేదని డీఎంకే పార్టీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.