Trending: ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా టైర్లు బ్లాస్ట్.. పైలట్ల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

విమానం టేకాఫ్ అవుతుండగా టైర్లు బ్లాస్ట్ అయిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

Update: 2024-07-11 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: విమానం టేకాఫ్ అవుతుండగా టైర్లు బ్లాస్ట్ అయిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-590 విమానం మరో 30 సెకండ్లలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందనగా రన్‌వేపై ఫ్లైట్ టైర్లు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. అనంతరం విమానం కింది భాగంలో స్వలంగా పొగలు, మంటలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రన్ వే చివరి పాయింట్ వరకు ఫ్లైట్ వెళ్లి ఆగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక‌వేళ పైలట్లు గమనించకుండా విమానాన్ని టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. టైర్ బ్లాస్ట్ అయిన సమయంలో విమానంలో 176 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు.

Tags:    

Similar News