Trending: కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.. అంతా కేసీఆర్ : ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సంచలన ట్వీట్
ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో పొలిటికల్ హాట్ పుట్టిస్తోంది. కేసులో విచారణ కొనసాగుతుండగా.. సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కేసులో విచారణ కొనసాగుతుండగా.. సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, టీవీ ఛానళ్ల అధిపతుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బహిర్గతమైంది. అదేవిధంగా పెద్దాయన (కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ రాధాకిషన్ రావు ఇచ్చిన వాగ్మూలం తాలూకు రిపోర్ట్ కాపీలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై కాంగ్రెస్ సంచలన ట్వీట్ చేసింది.
అయితే ఆ ట్వీట్‌లో ‘ఓటమి ముందే పసిగట్టి.. గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన బీఆర్ఎస్ అధినేత’ అంటూ కామెంట్ చేసింది. ‘అధికారం అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ కథ నడిపిన కల్వకుంట్ల గ్యాంగ్’ అంటూ ఫైర్ అయింది. ‘అన్ని ఆయన కనుసన్నల్లోనే జరిగాయని, రాధాకిషన్ రావు వాంగ్మూలం’ ఇచ్చాడంటూ కామెంట్ చేసింది. ‘కారెవరు ట్యాపింగ్‌కు అనర్హం అని విపక్ష నేతలవే కాకుండా.. సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయించిన కేసీఆర్ అంటూ ‘నేను ఉన్నాను.. నేను విన్నాను..’ అనే ట్యాగ్ లైన్‌తో కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.