Trending: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. వ్యాధిని తగ్గించే మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు
డయాబెటీస్.. ఈ రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా లక్షల మంది ఆ వ్యాధి బారిన పడుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: డయాబెటీస్.. ఈ రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా లక్షల మంది ఆ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి నుంచి రికవర్ అయ్యేందుకు సరైన మెడిసిన్స్ లేకపోవడంతో చాలా మంది నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే వారందరికీ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. డయాబెటిస్‌ను నిరోధించే లక్షణం కలిగి ఉన్న గుర్మార్ మొక్కను శాస్త్రవేత్తలు ఎట్టకేలకు కనిపెట్టారు. బీహార్ రాష్ట్రంలోని గయలో ప్రాంతంలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై ఎక్కువ సంఖ్యలో ఔషధ మొక్కలు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో షుగర్ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేసే అరుదైన గుర్మార్ మొక్క కూడా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, ఆ మొక్కలో ఉన్న జిమ్నెమిక్ యాసిడ్‌తో బీజీఆర్ 34 అనే మెడిసిన్ తయారు చేస్తారని వారు తెలిపారు. గుర్మార్ మొక్క రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో సమర్ధవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.