Trending: ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. నష్టాల్లో కొట్టుమిట్టాడుతోన్న ఆర్టీసీ, త్వరలో భారీగా చార్జీల పెంపు!

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో కేఎస్ ఆర్టీసీ నష్టా ఊబిలో కొట్టుమిట్లాడుతోంది.

Update: 2024-07-15 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో కేఎస్ ఆర్టీసీ నష్టా ఊబిలో కొట్టుమిట్లాడుతోంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వ ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలపై 15 నుంచి 20 వరకు పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. కేఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌‌ ఎస్ఆర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చార్జీల పెంపు అనివార్యమని తెలిపారు. ఒకవేళ మహిళకు ఉచిత బస్సు ప్రయాణంతో చార్జీలు పెంచకపోతే సంస్థ కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వాహనాలకు డీజిల్, ఫిట్‌నెస్ నిర్వహణకు రూ.‌కోట్ల మేర ఖర్చు అవుతున్నాయని వెల్లడించారు. అయితే, 2019 నుంచి ఇప్పటి వరకు బస్సుల్లో టికెట్‌ ఛార్జీలను ఏ మాత్రం పెంచలేదని అన్నారు. చివరి మూడు నెలల్లో సంస్థకు రూ.295 కోట్ల మేర నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచే విషయంలో తుది నిర్ణయం సీఎం సిద్ధరామయ్యదేనని అన్నారు.

Tags:    

Similar News