Viral : భక్తులకు ప్రసాదంగా నూడిల్స్, మోమోస్.. ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నారు..
సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, లడ్డు, సిరా, కొబ్బరి లాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం నూడిల్స్, మోమోస్
దిశ, ఫీచర్స్ : సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, లడ్డు, సిరా, కొబ్బరి లాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం నూడిల్స్, మోమోస్ ప్రసాదంగా ఇవ్వడం ఆచారం. ‘మినీ చైనా’గా పిలువబడే తూర్పు కోల్‌కతాలోని టాంగ్రాలో ఈ పద్ధతి చాలా కాలంగా ఉంటుంది. మాతేశ్వర్తల రోడ్‌లో ఉన్న చైనీస్ కాళీ టెంపుల్‌లో ఇలా జరుగుతుండగా.. ఆలయ విశిష్ట నైపుణ్యానికి అనుగుణంగానే ప్రసాదం ఇవ్వబడుతుందని చెప్తున్నాడు పూజారి.
చైనీస్, భారతీయ సంస్కృతుల సమ్మేళనంగా పిలవబడుతున్న కాళీ మాత ఆలయంలో ప్రతీ శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతం సందడిగా మారుతుంది. ముఖ్యంగా దీపావళి సమయంలో చేసే విశిష్ట పూజలు ఆత్మలను తరిమికొడుతాయని నమ్ముతారు భక్త జనాలు. ప్రత్యేక కాగితం, ధూపంతో చేసే ఆరాధన ఆసక్తికరంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఆలయంలో నారాయణ శిల ఉంది కాబట్టి పూజ కఠినమైన వేద నియమాలను అనుసరిస్తుందని అంటున్న పూజారి.. ప్రసాదం ఖచ్చితంగా శాకాహారంగానే ఉంటుందని చెప్తున్నాడు. రుచికరమైన సంప్రదాయాన్ని అనుసరిస్తూ మోమోలు, నూడిల్స్, స్టిక్కీ రైస్‌ను భక్తులకు అందిస్తున్నామని వివరించాడు. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘నిజమా? ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు ఉన్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.