పడుకుంటే పది లక్షలు ఇస్తున్న కంపెనీ.. ఇలా అప్లయ్ చేసుకోండి..

పడుకునేందుకు జీతం ఇస్తే ఎంత బాగుంటుందో కదా. ఎగ్జాక్ట్ గా ఇదే ఆఫర్ ఇస్తుంది ఇండియాకు చెందిన హోం అండ్ స్లీప్ సొల్యూషన్స్ బ్రాండ్ వేక్ ఫిట్. ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న కంపెనీ..

Update: 2024-09-05 11:01 GMT

దిశ, ఫీచర్స్ : పడుకునేందుకు జీతం ఇస్తే ఎంత బాగుంటుందో కదా. ఎగ్జాక్ట్ గా ఇదే ఆఫర్ ఇస్తుంది ఇండియాకు చెందిన హోం అండ్ స్లీప్ సొల్యూషన్స్ బ్రాండ్ వేక్ ఫిట్. ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న కంపెనీ.. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రెండు నెలలు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ కాలంలో పెర్ఫార్మెన్స్ బట్టి లక్ష నుంచి పది లక్షల వరకు చెల్లించనుంది. ఇంతకీ వివరాలు, అర్హతలు ఏంటో తెలుసుకుందాం.

జాబ్ టైటిల్ : ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్

లొకేషన్: వర్క్ ఫ్రమ్ బెడ్( ఇంట్లోనే)

డ్యురేషన్: రెండు నెలలు

బాధ్యతలు

రెగ్యులర్ గా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి

మధ్యాహ్నం 20 నిమిషాల పవర్ న్యాప్

రోజూ వేక్ ఫిట్ మ్యాట్రెస్ మీద సేమ్ టైంకు నిద్రపోవాలి

వారాంతాల్లో నిద్ర సమయం పొడగించాలి( ఎక్స్ ట్రా పాయింట్స్ కోసం)

స్లీప్ చాంపియన్ గా ఎదగాలి అనుకుంటే స్లీప్ మెంటార్స్ సెమినార్స్ అటెండ్ కావాలి

అర్హులు

నిద్ర అంటే ఇష్టపడే 22 ఏళ్లు పైబడిన ఎవరైనా..

ఏ సబ్జెక్ట్ లోనైనా డిగ్రీ లేదా పీజీ.. కానీ నిద్రపోవడంలో PhD చేసి ఉండాలి

ఆసక్తి గల అభ్యర్థులు లింక్డ్ ఇన్‌లో కంపెనీ పేజీకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు

Tags:    

Similar News