Viral Video : రీల్స్ పిచ్చి.. రోడ్డుపై ‘శవం’ అవతారమెత్తిన యువకుడు.. వీడియో వైరల్

ఓవర్ నైట్ పాపులర్ అవ్వాలని కొంత మంది యువత ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ పిచ్చిలో పడిపోయారు.

Update: 2024-09-16 11:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓవర్ నైట్ పాపులర్ అవ్వాలని కొంత మంది యువత ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ పిచ్చిలో పడిపోయారు. మరికొందరు అదే రీల్స్ పేరుతో పిచ్చి చేష్టలు చేస్తూ ఎదుటివారికి ఇబ్బందిగా మారుతున్నారు. తమను తాము మర్చిపోతూ రోడ్లపై రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు ‘శవం’ అవతారమెత్తాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ముఖేష్ కుమార్‌ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించాడు.

రోడ్డులో ఒకవైపు బారీకేడ్ పెట్టి బ్లాక్ చేసి దాని సపోర్ట్ తీసుకోని అంతక్రియాలు జరిపే సీన్‌ల.. కదలకుండా శవం మాదిరి వస్త్రం వేసుకుని పడుకున్నట్లు నటించాడు. తనపై తెల్లని దుప్పటి, ముక్కులో పత్తి, మెడలో దండ, దుప్పటిపై గులాబీ పూలు లాంటివి వీడియోలో కన్పిస్తున్నాయి. తర్వాత అతడు ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. దీనికి సంబంధించిన వైరల్ కావడంతో తాజాగా స్థానిక పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.


Similar News