Health Tips : ఈ పదార్థాలను ఎక్కువగా ఉడికిస్తే ప్రమాదం.. ఆ వ్యాధికి కారణం కావచ్చు !

కొన్ని రకాల కూరగాయలు, పదార్థాలు, మాంసం వంటివి పరిమితికి మించి వేడిచేసి తింటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.

Update: 2024-09-18 09:12 GMT

దిశ, ఫీచర్స్ : ఆహారం రుచిగా ఉండాలంటే చక్కగా వండాలంటారు. కొన్ని రకాల కూరగాయలు, పదార్థాలు, మాంసం వంటివి సరిగ్గా ఉండకకపోతే టేస్ట్ రాదని చెప్తుంటారు. అలాగే ఒక సారి వండాక కూడా మళ్లీ తినేటప్పుడు వేడి చేసుకొని తింటుంటారు కొందరు. కానీ పరిమితికి మించి వేడిచేసిన పదార్థాలు హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని చెప్తున్నారు.

క్యాన్సర్‌కు దారితీసే 80 శాతం ప్రాణాంతక కణితులు ఆహారపు అలవాట్లు, జీవనశైలి, బహిరంగ కార్యకలాపాల వల్లనే వస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ‘కార్సినోజెన్స్’ అనే సమ్మేళనాలు కలిగి ఉండే ఆహారాలవల్ల ఇలా జరుగుతాయంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో ప్రాసెస్ చేసిన మాంసం, సాసేజ్ (హాట్ డాగ్), మొక్కజొన్న, రెడ్ మీట్ వంటివి ఉంటున్నాయి. ఇవేకాకుండా ఎక్కువగా వేడిచేస్తూ వండటంవల్ల కూడా కొన్ని ఆహారాలు ప్రమాదకరం. వాటిలోని నైట్రోసో సమ్మేళనాల కారణంగా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని చెప్తారు.

* వైట్ బ్రెడ్ : తెల్ల రొట్టెలో కార్బో హైడ్రేట్లు, చక్కెర వంటివి ఎక్కువగా ఉండే వైట్ బ్రెడ్ సహా పలు ఆహారాలను సాధారణ స్థాయి వరకు ఉడికించాలి. అలా కాకుండా వందడిగ్రీల ఉష్ణోగ్రత దాటాక కూడా ఉడికిస్తే ప్రమాదం. ఇలా చేస్తే వాటిలో ‘యాక్రిలమైడ్’, కార్సినోజెన్ అనే క్యాన్సర్ కారక సమ్మేళనాలు ఏర్పడతాయి. కాబట్టి తక్కువ మంటపై ఉడికించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒకసారి బాగా కాల్చిన రొట్టెను లేదా బ్రెడ్‌ను మరోసారి బాగా కాల్చి తినడం మంచిది కాదు. అలాగే చపాతీలు, బ్రౌన్ రైస్, వోట్ మీల్, వీట్ పాస్తా కూడా ఎక్కువగా వేడిచేయకపోవడం మంచిదంటున్నారు నిపుణులు.

* బంగాళ దుపంపలు : వీటిని కూడా మరీ ఎక్కువగా ఉడకబెడితే క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అధికవేడి మీద వీటిని వండటం వల్ల యాక్రిలామైడ్ అనే హానికరమైన సమ్మేళనం విడుదలవుతుంది. కాబట్టి తక్కువ వేడిమీద ఉడికించాలి.

* ఒకే నూనె ఎక్కువసార్లు వాడటం: కొందరు బజ్జీలు, సకినాలు, పూరీలు వంటివి చేయడానికి వంట నూనె ఉపయోగిస్తారు. అయితే కడైలో మిగిలిపోయిన నూనెను తీసి పెట్టి, మరోసారి ఉపయోగిస్తారు. కూరల్లో కూడా వాడుతుంటారు. ఇలా చేయడం క్యాన్సర్ కారకం అంటున్నారు నిపుణులు.

* చేపలు : చేపలను మరీ ఎక్కువ సేపు ఉడికించినట్లయితే వాటిలో క్యాన్సర్ కారక సమ్మేళనాలు విడుదల అవుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఒకసారి పూర్తిగా ఉడికిన తర్వాత ఇంకాసేపు ఉడికించే ప్రయత్నం చేయడం మంచిది కాదు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.

Read More..

Best Foods: మహిళల్లో అండాశయ ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ ఫుడ్స్ ఇవే.. సంతానోత్పత్తి కోసం తప్పక తినాల్సిందే? 


Similar News