రజినీకాంత్ 'కూలీ' సినిమా ఫుటేజీ లీక్

రజినీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న 'కూలీ'(Coolie) చిత్ర ఫుటేజీ లీకవడం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది.

Update: 2024-09-18 16:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : రజినీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న 'కూలీ'(Coolie) చిత్ర ఫుటేజీ లీకవడం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలు బుధవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హీరో నాగార్జున(Nagarjuna) మీద తెరకెక్కిన పోరాట ఘట్టాలు లీక్ అవగా, ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా ఘటనపై స్పందించిన 'కూలీ' సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'రెండు నెలలుగా మేమందరం పడిన కష్టం వృథా అయింది. దయచేసి ఆ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దు, పైరసీని ప్రోత్సహించవద్దు' అని ఆ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

రజినీకాంత్ హీరోగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్ లోని ఫైట్ సీన్స్ ను ఎవరో ఫోన్లో రికార్డ్ చేసి, బుధవారం సోషల్ మీడియాలో పెట్టారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ వంటి అగ్రనటులు ఉండటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.   

Read More..

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సూర్య ‘కంగువ’.. వచ్చేది ఎప్పుడంటే? 


Similar News