భలే దొంగ.. అన్నీ దోచేశాడు.. చివరికి లేఖ రాసి అందులో ఏం చెప్పాడంటే?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఏ చిన్న వింత సంఘటన అయిన సరే వైరల్‌గా మారుతుంది.

Update: 2024-07-04 10:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఏ చిన్న వింత సంఘటన అయిన సరే వైరల్‌గా మారుతుంది. ఇటీవల ఓ దొంగ దోచుకోవడానికి వెళ్లి అక్కడే ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయిన ఘటన మరువక ముందే మరో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే..తమిళనాడులోని తూత్తుకుడిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ దొంగ దొంగతనానికి పాల్పడ్డారు. సెల్వన్, ఆయన భార్య ఇద్దరు రిటైర్డ్ ఉపాధ్యాయులు. వారివురు చెన్నైలో ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు జూన్ 17వ తేదీన వెళ్లారు. వారింట్లో సెల్వీ అనే ఓ పని మనిషిని పెట్టుకున్నారు. వారు ఇంట్లో లేనప్పుడు ఇంటిని శుభ్రంగా చేసేందుకు పెట్టుకున్నారని సమాచారం.

అయితే ఓ రోజు ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లిన సెల్వీ తలుపులు తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తను సెల్వన్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో హుటహుటీన ఆయన నివాస స్థలానికి చేరుకున్నారు. దీంతో ఇంట్లో దొంగలు పడ్డారని గమనించి..రూ.60 వేల నగదు, 12 గ్రాముల బంగారు నగలు, వెండి పట్టీలు దోచుకెళ్లినట్లు చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టాగా దొంగ రాసిన క్షమాపణ లేఖ కనిపించింది. ‘ఆ లేఖలో తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ ఉంది. తన ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోవడం వలన ఈ పని చేయాల్సి వచ్చిందిని తెలిపారు’. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Similar News