చైనాలో కుక్కలకు పెళ్లిళ్లు.. తీవ్రంగా నష్టపోతున్న దేశం...

చైనా జనాభాను అరికట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం అక్కడ యువకుల కన్నా వృద్ధులే ఎక్కువైపోయారు. దీంతో మళ్లీ పిల్లలను కనాలనే ప్రచారం జరుగుతుంది.

Update: 2024-07-06 15:43 GMT

దిశ, ఫీచర్స్: చైనా జనాభాను అరికట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం అక్కడ యువకుల కన్నా వృద్ధులే ఎక్కువైపోయారు. దీంతో మళ్లీ పిల్లలను కనాలనే ప్రచారం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు కూడా పెరిగిపోయాయి. కానీ అక్కడి జనం మాత్రం ఈ విషయంపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 40ఏళ్లు వచ్చినా పిల్లలకు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధంగా లేరు. పైగా కుక్కలు, పిల్లులను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటికి పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. ప్రజెంట్ చైనాలో ఈ ట్రెండ్ దూసుకుపోతుంది.

పరిశోధనా సంస్థ అక్యూటీ నాలెడ్జ్ పార్ట్‌నర్స్ గణాంకాల ప్రకారం, 2023 నాటికి, పట్టణ చైనాలో 116 మిలియన్లకు పైగా పిల్లులు, కుక్కలు ఉన్నాయి. చైనా పట్టణ జనాభా అంతటా సమానంగా పంపిణీ చేయబడితే, దాదాపు ఎనిమిది మందిలో ఒక పెంపుడు జంతువు ఉందని తేలింది. 2022నుంచి కుక్కలకు వివాహాలు చేసే కల్చర్ పెరిగిపోగా... మనుషులకు ఎంత ఘనంగా మ్యారేజ్ చేస్తారో అలాగే జరుపుకుంటున్నారు. ఎంతలా అంటే డాగ్స్ కు మ్యారేజ్ కేక్స్ తయారీకి స్పెషల్ బేకరీలు కూడా వచ్చేశాయి. ఆర్డర్స్ భారీగా పెరిగిపోయాయి. లక్షల్లో బిజినెస్ జరుగుతుంది. అయితే ఇదే కంటిన్యూ అయితే న్యూ జనరేషన్ లేక చైనా ఇబ్బందులు పడక తప్పదని అంటున్నారు విశ్లేషకులు.


Similar News