మార్నింగ్ వాకింగ్‌కు రాలేదని.. బ్యాండ్‌ పెట్టి నిద్రలేపిన ఫ్రెండ్స్ (వీడియో)

ఫ్రెండ్స్ అందరూ కలిసి మార్నింగ్ వాకింగ్, రన్నింగ్‌కి వెళ్లడం సర్వసాధారణం. అలా మార్నింగ్ వాకింగ్‌ వెళ్లే సమయంలో తమ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఎవరో ఒకరు వాకింగ్‌కు రోజూ డుమ్మ కొడుతుంటారు. ఆ టైంలో వారికి ఫోన్ చేస్తే.. కాల్ లిఫ్ట్ చేయరు.. ఇంట్లోనే సోమరిపోతులా నిద్రపోతుంటారు.

Update: 2023-10-31 13:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్రెండ్స్ అందరూ కలిసి మార్నింగ్ వాకింగ్, రన్నింగ్‌కి వెళ్లడం సర్వసాధారణం. అలా మార్నింగ్ వాకింగ్‌ వెళ్లే సమయంలో తమ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఎవరో ఒకరు వాకింగ్‌కు రోజూ డుమ్మ కొడుతుంటారు. ఆ టైంలో వారికి ఫోన్ చేస్తే.. కాల్ లిఫ్ట్ చేయరు.. ఇంట్లోనే సోమరిపోతులా నిద్రపోతుంటారు. దీంతో చేసేదేమీలేక మిగతా ఫ్రెండ్స్ కలిసి వాకింగ్‌కు వెళతారు. కానీ దీనికి భిన్నంగా ఒక సంఘటన జరిగింది. తమ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఓ వ్యక్తి మార్నింగ్ వాకింగ్‌కు గత కొన్ని రోజులు రాకుండా ఇంట్లోనే నిద్రపోవడంతో.. అతడిని ఎలాగైనా వాకింగ్‌కు తీసుకవెళ్లాలని మిగితా ఫ్రెండ్స్ ఒక ఉపాయం ఆలోచించారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆ ఫ్రెండ్ ఇంటికి బ్యాండ్ మేళంతో వెళ్లి ఆ ఫ్రెండ్‌ను నిద్రలేపి వాకింగ్‌కి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కనిపించే వారంతా సుమారు 40 ఏళ్లకు పైబడిన వారు కనిపిస్తారు. అతని ఫ్రెండ్ బయటకు వచ్చి బ్యాండ్ ఆపండి అంటూ దండం పెడుతున్నాడు. ఇలాంటి ఫ్రెండ్స్ మాకూ ఉంటే ఎంతో బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఫ్రెండూ అవసరమేరా అని, మా ఫ్రెండ్స్‌కి కూడా ఇలాగే చేయాలని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వారి ఫ్రెండ్ షిప్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.


Tags:    

Similar News