ఏనుగుకు ఆకలేసింది! ఫ్రీ రేషన్ కోసం వచ్చిందంట.. వీడియో వైరల్
అడవుల్లో జంతువులకు ఫుడ్ దొరకడం లేదని మరోసారి రుజువైంది. అడవికి సమీపంలో ఉండే గ్రామాల్లోకి ఏనుగులు వస్తున్న ఘటనలు చూసే ఉంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అడవుల్లో జంతువులకు ఫుడ్ దొరకడం లేదని మరోసారి రుజువైంది. అడవికి సమీపంలో ఉండే గ్రామాల్లోకి ఏనుగులు వస్తున్న ఘటనలు చూసే ఉంటారు. అవి గ్రామాల్లో బీభత్సం సృష్టించి అందరిని భయాందోళనకు గురి చేస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లోని గుండ్లుపేట్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు ఆహారం కోసం ప్రయత్నించి జనవాసాల్లోకి వచ్చింది. ఆవేశంగా వస్తున్న ఏనుగును చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఏనుగు మాత్రం ఏకంగా బియ్యం గోడౌన్‌లోకి ప్రవేశించింది. గోడౌన్ షటర్లు ముసిఉండటంతో ఆ షటర్‌ను ఏనుగు తొండంతో పగుల గొట్టింది. తర్వాత అందులో ఉన్న ఒక బియ్యం బస్తాను బయటకు తీసి దాన్ని తినేందుకు ప్రయత్నించింది. ఫారెస్ట్‌లో ఫుడ్ లేదని ఏనుగుకు తెలుసని, అందుకుకే ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్‌కు ఫుడ్ కోసం వచ్చిందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆ ఏనుగు ఫ్రీ రేషన్ బియ్యం తీసుకోవడానికి వచ్చిందని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.