SEEMA ANAND: నోరు తెరిస్తే శృంగారం గురించే మాట్లాడుతుంది.. ఇంతకీ ఎవరీమె?నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన మహిళ
పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యకర మాటలు మాట్లాడితే పక్కవారికి ఎంత ఇబ్బంది కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, ఫీచర్స్: పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యకర మాటలు మాట్లాడితే పక్కవారికి ఎంత ఇబ్బంది కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలాంటి శృంగారం అనే పదం యూజ్ చేస్తే జనాలు ఏ రేంజ్‌లో ఫైర్ అవుతారో ఒకసారి ఊహించుకోండి. కానీ సీమా ఆనంద్ అనే మహిళ నోట సెక్స్ అనే మాట తప్ప మరో మాట రాదట. ఇంతకీ ఎవరీమే అంటే.. వివరాల్లోకెళ్తే.. సీమా ఆనంద్ అనే మహిళ లండన్‌లో ఉంటుంది. అయితే సీమా ఆనంద్ సొసైటీలో శృంగారంపై ఉన్న తప్పుడు అభిప్రాయాలు, సందేహాలను ప్రజల మైండ్‌లో నుంచి తొలగించాలన్నదే తన లక్ష్యమని చెబుతుంది.
సీమా ఆనంద్‌కు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సీమా శృంగారం గురించి చాలా సెర్చ్ చేశారు. దీని గురించి తన భర్తకు చెప్పి డిస్కషన్ చేస్తే సైలెంట్‌గా ఇంట్లో కూర్చోమన్నారట. అయినా కూడా సీమా భర్త మాట వినకుండా అనుకున్నది చేసేవరకు పట్టు వదలలేదు. నోరు తెరిస్తే శృంగారం గురించే మాట్లాడుతుందని, చెప్పిన మాట వినడం లేదని సీమా ఆనంద్‌ను భర్త వదిలేసి వెళ్లిపోయారు. కానీ తన పిల్లలు సీమాకు మద్ధతుగా నిలిచారు. ఇక అప్పటి నుంచి శృంగారం గురించి సమాజానికి ఓ అవగాహన రావాలని సీమా ఆనంద్ సోషల్ మీడియాలో శృంగార వీడియోలు పంచుకుంటూ ఉంటుంది.
ఈమె మాట్లాడే విధానం పట్ల, పోస్ట్ చేసిన వీడియోల పట్ల ఎంతో మంది ఎన్నో విమర్శలు చేసినా సీమా ఆనంద్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. అవన్నీ మనసుకు తీసుకుని బాధపడుతూ కూర్చుంటే ముందు తరాల వారికి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన ఉండదని సీమా వెల్లడించారు. ఇన్నాళ్లుగా సీమా ఆనంద్ శృంగారం గురించి చేసిన రీసెర్చ్‌ను ఓ పుస్తక రూపంలో త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారట.