సైన్స్ కే సవాల్.. ఏడాది వయసున్న అమ్మాయి తలలో పిండం
చైనాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన సైన్స్ కే ఒక సవాల్ విసిరింది..
దిశ, వెబ్ డెస్క్: చైనాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన సైన్స్ కే ఒక సవాల్ విసిరింది. ఏడాది వయసున్న ఓ బాలిక తలలో గర్భం దాల్చిన ఘటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
వివరాల్లోకి వెళితే.. చైనాలో ఓ బాలిక ఇటీవల పుట్టింది. అయితే అప్పటి నుంచి ఆ అమ్మాయి తల బెలూన్ లాగా పెరుగుతోంది. కానీ వయసు పెరగడం లేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె తలలో పెరుగుతున్న పిండాన్ని ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె తలలో ఉన్న పిండాన్ని తొలగించి బాలికను ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ అమ్మాయి తన తల్లి కడుపులో ఉన్నప్పుడే తలలో పిండం పెరగడం ప్రారంభమైందని వైద్యులు భావిస్తున్నారు. ఎందుకంటే పుట్టుబోయో బిడ్డ నడుము, ఎముకలు, వేళ్లకు గోర్లు అభివృద్ధి చెందాయని అంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇదే మొదటి కాదని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కంటే ఎక్కువనే ఇటువంటి కేసులు సంభవించాయని వైద్యులు తెలిపారు.