చంద్రబాబు పుట్టినరోజున సొంత చెల్లి బర్త్ డే.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..
నేడు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు.
దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులతో పాటుగా అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్జీవీ సోదరి విజయ పుట్టిన రోకు కూడా ఈ రోజే.
కాగా ట్విట్టర్ వేదికగా తన సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. హే.. విజయా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు నా స్వంత సోదరి అయినప్పటికీ, నేను ఇష్టపడని ఏకైక విషయం ఏమిటంటే, మీకు పూర్తి భిన్నంగా ఉండే.. ఒక స్వార్ధపరుడు, మోసగాడు, మానవత్వం లేని వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నీ పుట్టిన రోజు ఒక రోజు కావడమే అని ట్వీట్ చేసారు. కాగా ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తూ కామెంట్లల్లో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Read More..
చంద్రబాబు ఎప్పుడూ ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారు: ప్రధాని మోడీ