RARE : కవలలకు జన్మనిచ్చిన ఏనుగు.. థాయ్‌లాండ్‌లో చాలా అరుదైన ఘటన

ఏనుగులు కవల పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదైన విషయం. అయితే తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ ఏనుగు కవల పిల్లలకు జన్మనిచ్చి.. వార్తల్లో నిలిచింది.

Update: 2024-06-14 09:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏనుగులు కవల పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదైన విషయం. అయితే తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. ఓ ఏనుగు కవల పిల్లలకు జన్మనిచ్చి.. వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. థాయ్‌లాండ్‌లో ఓ ఏనుగుకు కవల పిల్లలు జన్మించాయి. ఇందులో ఆడ, మగ ఏనుగు ఉన్నాయి. రాయల్ క్రాల్‌లోని ఆయుత్తాయ ఎలిఫెంట్ ప్యాలెస్‌లో చంచూరి (36) అనే ఏనుగుకు ఒకదాని తర్వాత ఒకటి జన్మించాయి. దీంతో కీపర్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

 

యువ దూడలు వరుసగా 80 కిలోగ్రాములు, 60 కిలోగ్రాముల బరువు కలిగి ఉన్నాయని, వాటికి మంచి పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా కీపర్లు తెలిపారు. కాగా, ఏనుగులకు కవలలు జన్మించేందుకు ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అవి 22 నెలలపాటు గర్భధారణతో ఉంటాయి. నాలుగేళ్లకోసారి పిల్లలకు జన్మనిస్తాయి.

Tags:    

Similar News