Kalpavriksha Tree: ప్రభాస్ ఇంట్లో కోటి రూపాయల చెట్టు.. ఎందుకు ఇంత పెడ్తున్నాడు?

Kalpavriksha Tree: మనిషి అన్నాక కోరికలు సహజం. ఎలాంటి కోరికలైనా తీర్చగల ఒకే ఒక చెట్టు అదే కల్పవృక్షం.

Update: 2025-03-19 04:10 GMT
Kalpavriksha Tree: ప్రభాస్ ఇంట్లో కోటి రూపాయల చెట్టు.. ఎందుకు ఇంత పెడ్తున్నాడు?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : Kalpavriksha Tree: మనిషి అన్నాక కోరికలు సహజం. ఎలాంటి కోరికలైనా తీర్చగల ఒకే ఒక చెట్టు అదే కల్పవృక్షం. కల్పవృక్షం. మన కోరికలన్నింటినీ తీరుస్తుందని భగవద్గీత చెబుతోంది. కోరికలు కోరుకోవడం తప్పు కాదు..కానీ తప్పుడు కోరికలు కోరుకోవడం తప్పు. ఆ తప్పుడు కోరికలు కోరుకోవడం వల్లే ఇంద్రుడు ఈ కల్పవృక్షాన్ని తన స్వర్గలోకానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి ఐదు తూటల మధ్య ఉన్న ఈ కల్పవృక్షాన్ని నాటాడు. అక్కడ కల్పవృక్షంతోపాటు మందన, పారిజాత, సంతన, హరిచందన అనే వృక్షాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కల్పవృక్షం వలే కోరిన కోరికలను తీరుస్తాయని. హిందూ పురాణాల ప్రకారం అశోక సుందరి పార్వతీదేవి ఒంటరిగా ఉండటం చూడలేక ఈ కల్పవృక్షాన్ని పార్వతీదేవికి ఇచ్చిందట. ఈ కథ అంతా పురాణాలకు సంబంధించి. ఇదంతా ఎందుకు చెబుతున్నారన్నదే కదా మీ డౌట్. ఇప్పుడు అక్కడికే వస్తున్నాం.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో ఈ కల్పవృక్షం మొక్కలు నాటారు. అంబానీ గార్డెన్ లో ఇవి 4 మొక్కలు ఉన్నాయట. ఈ మొక్కలు ధనవంతులను చేస్తాయని..ఇంటికి శ్రేయస్సు తెచ్చే శక్తి వాటిలో ఉందని చాలా మంది జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం ధనవంతులు కావాలనే మన లక్ష్యాన్ని సాధించవచ్చు. అంబానీ వంటి ధనవంతులు కూడా ఈ పరిహారాలను ఉపయోగిస్తారని చాలా మంది జ్యోతిష్కులు చెబుతున్నారు.అందుకే అంబానీ గార్డెన్ లో ఈ మొక్కలను నాటారట.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్లో కూడా ఈ మొక్కను నాటారు. ఈ మొక్క ఖరీదు కోటి రూపాయలు అటు. ఈ కల్పవృక్షం చెట్లు ముఖేశ్ అంబానీ, ప్రభాస్ ఇంట్లో మాత్రమే ఉన్నాయట. ఇంత ఖరీదు చేసిన మొక్కలను ఇంట్లో ఎందుకు నాటుకుంటున్నారనే కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొక్కను ఇంట్లో నాటగానే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుందా? ఇంటి ముందు కల్పవృక్షం ఉండగానే స్టాక్ మార్కెట్ పెరిగిపోతుందా? మరి ఈ లాజిక్ ప్రకారం, అంబానీ ఇంకా డబ్బులు సంపాదించడానికి బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? ప్రభాస్ ఇంకా సినిమాలు ఎందుకు చేస్తున్నారు? ఒక్కోసారి మనం అసలు ధనవంతులు ఎందుకు ధనవంతులయ్యారు అనే రీజన్ వదిలేసి, ఇలాంటి ఊహాజనితమైన జ్యోతిష్య పరిష్కారాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటామని అనిపించడంలేదా? ఈ విధంగా ప్రశ్నించేవారు కూడా కనిపిస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ధనవంతులు కావడానికి కష్టపడాలి.. తెలివిగా పనిచేయాలి. కల్పవృక్షం నీడలో కూర్చొని కోరికలు కోరుకుంటూ కూర్చుంటే, చివరకు ఆకులు వాడిపోతాయి కానీ, బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం పెరగదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కొందరు కౌంటర్ ఇస్తున్నారు.


Read More..

SSMB-29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై అదిరిపోయే అప్డేట్.. హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు(పోస్ట్)  

Tags:    

Similar News

Meenaakshi Chaudhary