జేబులో ఫోన్ పేలి.. యువకుడికి తీవ్ర గాయాలు!
ఈ మధ్యకాలంలో ఛార్జింగ్ పెట్టిన సమయంలో, చేతిలో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ఛార్జింగ్ పెట్టిన సమయంలో, చేతిలో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్లు అకస్మాత్తుగా పేలిపోతున్నాయి. ఇలాంటి ఘటనే కేరళ కోజికోడ్‌లో చోటుచేసుకుంది. రైల్వేలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఫారిస్ రెహమాన్ అనే వ్యక్తి.. ముఖం కడుక్కోవడానికి వాష్‌రూమ్‌కు వెళ్లే సమయంలో ‘రియల్ మీ’ స్మార్ట్ ఫోన్‌ను ప్యాంటు జేబులో వేసుకున్నాడు. కొద్ది నిమిషాల్లోనే ఆ మొబైల్ సడన్‌గా పేలింది. దీంతో మంటలు చేలరేగాయి. రెహమాన్, తన బట్టలు మంటల్లో కాలిపోవడంతో.. అక్కడే ఉన్న తోటి కార్మికులు మంటలు ఆర్పి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అతను స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు సదరు బ్రాండ్‌పై కోర్టులో ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.