చిల్లర డబ్బులతో స్పోర్ట్స్ బైక్ కొనుగోలు.. ఔరా అనిపించిన పాలిటెక్నిక్ విద్యార్థి
సాధారణంగా చాలా మంది యువకులకు కొన్ని రకాల బైకులు, కార్లు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది..
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చాలా మంది యువకులకు కొన్ని రకాల బైకులు, కార్లు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. వాటి కోసం కొంత మంది తల్లిదండ్రులతో గొడవలు పడుతూ కొనుకుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం బైక్‌ను కొనడానికి వింత ప్రయత్నం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేష్ అనే విద్యార్థి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. అయితే సొంతంగా స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలని కలలు కన్నాడు. అలాగే తన సొంత పట్టణంలో ఇష్టమైన బైక్‌పై తిరగాలనుకున్నాడు. దీని కోసం 112 బస్తాల రూ.1 బిల్లలను పొదుపు చేసి మొత్తం రూ. 2.85 లక్షలు చేసి బండిని కొన్నాడు. అంత చిల్లరను లెక్కించడానికి సిబ్బందికి దాదాపు ఒక పూట పట్టింది.
Read More....