టెన్త్ స్టేట్ టాపర్‌గా నిలిచిన అమ్మాయి.. రెచ్చిపోతున్న ట్రోలర్స్.. వీడియో వైరల్..
విద్యార్థులు వికసించే పువ్వులు.
దిశ వెబ్ డెస్క్: విద్యార్థులు వికసించే పువ్వులు. అలాంటి విద్యార్థులు పొరపాటున వెనకబడితే.. ఆ విద్యార్థులకు ధైర్యం చెప్పి ఆత్మస్తైర్యాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరికీ ఉంది. అయితే విద్యార్థుల్లో ఆత్మస్తైర్యాన్ని పెంచడం మాట దేవుడెరుగు, వాళ్ళను మానసికక్షోభకు గురిచేస్తున్నారు కొందరు కిరాతకులు. విద్యార్ధులపై ట్రోల్ల్స్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇలా విద్యార్ధులపై ట్రోల్ల్స్ చేసిన ఘటనలు గతంలో కోకొల్లలు.
తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఉతీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటి స్తానంలో నిలిచింది ఓ విద్యార్థిని. అయితే ఆ విద్యార్థినిని ప్రసంసించాల్సిందిపోయి ఆ బాలికపై ట్రోల్ల్స్ వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌కి చెందిన ప్రాచీ నిగమ్ అనే విద్యార్థిని ఇటీవల విడుదలైన పదో తరగతి ఫిలితాల్లో 600 మార్కులకు గానూ.. 591 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచింది. అయితే ఆ బాలిక మొఖంపై అవాంఛిత రోమాలు ఉన్నాయి.
దీనితో ఆ అమ్మాయి ఫోటోను మార్ఫింగ్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొందరు పోకిరీలు. కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయిని అభినందించాల్సిందిపోయి ఆ విద్యార్థినిని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ విద్యార్థిని మాత్రం ఆ ట్రోల్స్‌ను ఖాతరు చేయడంలేదు. తన పని తాను చేసుకుపోతోంది. అలానే బాలిక తల్లిదండ్రులు కూడా ఆ ట్రోల్స్‌ని పట్టించుకోవడం లేదు. తమ కూతురు సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా ఆ విద్యార్థినిపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన నెటిజన్స్ ఓ వైపు ఆ విద్యార్థినికి అభినందనలు తెలుపుతూనే.. మరో వైపు ట్రోలర్స్‌ను ఏకిపారేస్తున్నారు. అలానే ఆ విద్యార్థినిపై ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.