NEET Aspirant: నీట్ విద్యార్థిని హింసించి.. ప్రైవేట్ పార్టుకు ఇటుక వేలాడదీసి టార్చర్..
ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. భర్తను టార్చర్ పెట్టిన భార్య ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. భర్తను టార్చర్ పెట్టిన భార్య ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. ఓ రూమ్‌లో అతడిని ఒక్కడిని చేసి.. మంటలతో కాల్చి, తన ప్రైవేట్ భాగానికి ఇటుకతో కట్టేసి ఆరుగురు విద్యార్థులు తీవ్ర స్థాయిలో హింసించారు.
భాదితుడు వదిలేయండని వేడుకుంటున్న కూడా నిందితులు కనికరం లేకుండా టార్చర్ చేశారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లో ఓడినందుకు రూ.20 వేలు చెల్లించడానికి నిరాకరించడంతో అతనిపై దాడి చేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటన ఏప్రిల్ 20 నాటిదని అక్కడి డీసీపీ పేర్కొన్నారు. బాధిత విద్యార్థి ఇటావా జిల్లాలోని లావేడి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో నివసం ఉంటున్నారని సెంట్రల్ డీసీపీ తెలిపారు. భాదితుడు ఆర్ఎస్ గౌతమ్, ఇంటర్ పూర్తి చేశాడు. అతను మండిలోని కాకడియో కోచింగ్ తీసుకుంటూ నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు, నిందితులు కూడా నీట్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.