పరీక్షల్లో కొడుకు కంటే ఎక్కువ మార్కులు సాధించిన తల్లి..

ఆడవారు ఇంట్లో ఉండే సమస్యలతోనో లేక ఇతర కారణాల చేతనో చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లిళ్లు చేసుకుంటారు.

Update: 2023-05-26 09:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆడవారు ఇంట్లో ఉండే సమస్యలతోనో లేక ఇతర కారణాల చేతనో చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లిళ్లు చేసుకుంటారు. అయినప్పటికీ కొంతమందికి చదువు మీద ప్రేమ అలాగే ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ మహిళ తన కొడుకుతో కలిసి 12వ తరగతి పరీక్షలు రాసింది. ఇందులో కొడుకు కంటే ఎక్కువ మార్కులు సాధించి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే..

బెంగాల్‌కు చెందిన లతిక (38) ఆర్థిక ఇబ్బందులతో ఆరో తరగతి చదువుతుండగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చదువుపై ఉన్న ఆసక్తితో పిల్లలకు పాఠాలు చెబుతూ.. తానూ చదివేది. ఈ క్రమంలోనే కుమారుడు సౌరవ్(17) తో కలిసి 12 వ తరగతి ఎగ్జామ్స్ రాసింది. పరీక్షల్లో తల్లీకొడుకు ఒకేసారి పాసయ్యారు. కానీ, లతికకు 500కు 324 రాగా కుమారుడికి 284 మార్కులు వచ్చాయి. కొడుకు కంటే ఎక్కువ మార్కులు రావడంతో సంతోషంగా లేనని, అతడికే ఎక్కువ మార్కులు వస్తే బాగుండేదని లతిక తెలిపారు

Tags:    

Similar News