Lawrence Bishnoi: బిష్ణోయ్‌ని చంపితే రూ.1.11 కోట్ల రివార్డ్.. క్షత్రియ కర్ణి‌సేన చీఫ్ సంచలన ప్రకటన

జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్‌లో ఏ పోలీస్ అధికారి అయిన చంపితే అక్షరాల రూ.1.11 కోట్ల రివార్డును ఇస్తామని క్షత్రియ కర్ణి‌సేన చీఫ్ కాసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు.

Update: 2024-10-22 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi)ని ఎన్‌కౌంటర్‌ (Encounter)లో ఏ పోలీస్ అధికారి అయిన చంపితే అక్షరాల రూ.1.11 కోట్ల రివార్డును ఇస్తామని క్షత్రియ కర్ణి‌సేన చీఫ్ (Kshathriya Karni Sena Chief) కాసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా (National Media) సైతం ధృవీకరించింది.

అయితే, తమ జాతి గర్వించదగిన వ్యక్తి రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్‌ గోగమేడి జీ (Amar Shahid Sukhdev Singh Gogamedi ji)ని లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ కాల్చి చంపిందని క్షత్రియ కర్ణిసేన చీఫ్ ఆరోపించారు. డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారని ఫైర్ అయ్యారు. తరువాత ఆ హత్య తామే చేసినట్లుగా లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ముఠా కూడా ప్రకటించుకుందని కర్ణిసేన చీఫ్ గుర్తు చేశారు.

కాగా, ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) గుజరాత్‌ (Gujarat)లోని సబర్మతి జైలు (Sabarmati Jail)లో ఉన్నాడు. 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ (Salman Khan)ను చంపేందుకు కుట్ర చేశాడని, ఏకంగా అతడి ఇంటి బయట తుపాకీతో కాల్పులు జరిపాడనే ఆరోపణలు ఎదర్కొంటున్నాడు. ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖ్ (Baba Siddiqui) హత్యతో ఆయనకు సంబంధం ఉన్నట్లుగా జాతీయ మీడియా (Mational Media)లో ఊహాగానాలు వినిపిస్తుండగా.. బిష్ణోయ్ ప్రస్తుతం సరిహద్దు స్మగ్లింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.

Tags:    

Similar News