Fairness Creams: ఫెయిర్‌నెస్ క్రీములతో ఆ సమస్యలు.. ప్రముఖ సర్వే సంస్థ

మహిళలు, ముఖ్యంగా యువతులు మార్కెట్‌లో దొరికే రకకరాల ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతుంటారు.

Update: 2024-04-14 15:36 GMT

దిశ వెబ్ డెస్క్: మహిళలు, ముఖ్యంగా యువతులు మార్కెట్‌లో దొరికే రకకరాల ఫెయిర్‌నెస్ క్రీములను వాడుతుంటారు. అయితే ఫెయిర్‌నెస్ క్రీములను వాడడం కారణంగా భారత దేశంలో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని తాజా సర్వేలో తేలింది. ఫెయిర్‌నెస్ క్రీముల తయారీలో పాదరసం వాడుతున్నారు. దీని కారణంగానే మెంబ్రేనస్ నెఫ్రోపతి కేసులు పెరుగుతున్నాయని తాజా సర్వే వెల్లడించింది.

ఇక ఈ క్రీములు కిడ్నీ ఫిల్టర్లను డ్యామేజ్ చేసి ప్రోటీన్ లీకేజీకి కారణమవుతున్నాయని పేర్కొంది. ఇక ఆరోగ్యానికి హాని కలిగించే ఈ క్రీములు వాడకంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

Tags:    

Similar News