ఇదెక్కడి ఇచ్చంత్రం ముచ్చటో కదా..! వాటికి కూడా రూ.444 టికెట్ కొట్టిన కండక్టర్ (ఫొటో వైరల్)

మన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణించే సౌలభ్యం కల్పించింది.

Update: 2024-03-28 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణించే సౌలభ్యం కల్పించింది. అయితే, కర్ణాటకలో కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ఇదే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తున్న బస్సులో ఇచ్చంత్రం చోటుచేసుకుంది. బెంగళూరు పట్టణానికి చెందిన ఓ మహిళ తన మనవరాలితో కలిసి మైసూరు వెళ్లేందుకు బస్సెక్కింది. అయితే, సదరు మహిళ తన వెంట రెండు రామచిలుకలను తన వెంట తీసుకెళ్తోంది. అది గమనించిన కండక్టర్ ఇద్దరికీ ఫ్రీ టికెట్ ఇచ్చేశాడు. కాగా, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. వారు తీసుకెళ్తున్న చిలుకలను పిల్లలుగా పరిగణిస్తూ ఆ కండక్టర్ ఏకంగా రూ. 444 టికెట్ కొట్టి ఆ మహిళ చేతిలో పెట్టాడు. దీంతో అవాక్కైన తోటి ప్రయాణికుడు రూ.444 టికెట్‌తో బామ్మ, మనవరాలు, రామచిలకల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఆ పిక్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా, నిబంధనల ప్రకారం జంతువులు, పక్షులను తీసుకెళ్తే.. వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News