Sex dolls: ఆ సమయంలో అవే ముఖ్యం..!.. సెలబ్రిటీల సెక్స్ డాల్స్‌కు భారీ డిమాండ్ !

ప్రస్తుతం సెలబ్రిటీల తరహాలో కనిపించే సెక్స్ డాల్స్‌కు భారీ డిమాండ్ ఉంది.

Update: 2024-09-22 11:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సెలబ్రిటీల తరహాలో కనిపించే సెక్స్ డాల్స్‌కు భారీ డిమాండ్ ఉంది. మొదట్లో ఈ సిలికాన్ బొమ్మల్ని టిన్-క్యూర్ సిలికాన్ నుంచి తయారు చేశారు. వీటిని జాయ్ టాయ్ , లవ్ డాల్ , Fu**k డాల్ లేదా బ్లోఅప్ డాల్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ బొమ్మ మనిషి రూపంలో ఉండి.. అన్ని భాగాలను కలిగి ఉంటుంది. సెక్స్ డాల్స్ సంక్లిష్టమైన పరస్పర చర్యలలో పాల్గొనడానికి రూపొందించబడిన మానవరూప క్రియేషన్‌ అని చెప్పుకోవచ్చు. మల్టీ బిలియన్ డాలర్ల మార్కెట్‌లో ఈ సెక్స్ డాల్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పెద్ద సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇవి మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి భారీగానే డిమాండ్ ఉంటుంది.

సెలబ్రిటీలలా ఉండే బొమ్మలు తయారు చేసి మార్కెట్‌లో అమ్మితే ఎక్కువగా అమ్ముడుపోతాయనే అభిప్రాయపడుతున్నారట అమ్మకం దారులు. సెక్స్ టాయ్స్‌కు మన ఇండియాలో కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ బాలీవుడ్ సెలబ్రిటీలను తలపించే సెక్స్ డాల్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో అందుబాటులో లేవు. విదేశాల నుంచి రిచ్ కస్టమర్లు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. అయితే చాలా మంది శృంగారం టైంలో తమ భాగస్వామిలో ఒకరిని మాత్రమే కాకుండా సెక్సీగా ఉన్నవారిని ఊహించుకుంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు. సెలబ్రిటీలపై వ్యామోహానికి కారణం ఇదేనంటున్నారు. కానీ ఆడబొమ్మలకు ఉన్నంత డిమాండ్ మగ సెక్స్ డాల్స్‌కు ఉండదని అంటున్నారు.


Similar News