Enna speed thalaa : కారులో 234 kms వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్.. నెటిజన్ల కీలక సూచన

తమిళ చిత్రసీమలో అగ్రనటుడు అజిత్ కుమార్‌కు బైక్, కార్ రేసింగ్ పై ఉన్న మక్కువ గురించి తెలిసిందే.

Update: 2024-08-29 06:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ చిత్రసీమలో అగ్రనటుడు అజిత్ కుమార్‌కు బైక్, కార్ రేసింగ్ పై ఉన్న మక్కువ గురించి తెలిసిందే. తాజాగా ఆయన కారు అత్యంత వేగంతో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన తన ఆడీ కారులో గంటకు 234 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను అజిత్ అభిమానులు ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ స్పీడ్ ఏంటి తల.. (ఎన్నా స్పీడ్ తలా) అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కారులో స్పీడ్‌గా వెళ్లడం కాదు.. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. తనని చూసి అభిమానులు కూడా జాగ్రత్తలు పాటించకుండా ఇండియన్ రోడ్లపై వాహనాలు నడుపుతారని పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా, హీరో అజిత్ కుమార్ వద్ద ఖరీదైన కార్లు, బైకులు ఉన్నాయి. ఇంటర్‌నేషనల్ ఎఫ్ఐఏ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు.


Similar News