Funeral: ఎనిమిదేళ్ల బాలుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు!
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటే.. ఆ వ్యక్తి ఏ రాజకీయ నాయకుడో లేక ఇతర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారై ఉంటారు.
దిశ, వెబ్‌డెస్క్: అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటే.. ఆ వ్యక్తి ఏ రాజకీయ నాయకుడో లేక ఇతర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారై ఉంటారు. కానీ, ఒడిశాలో ఎనమిదేళ్ల బాలుడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన శుభజిత్ సాబు (8) స్థానికం ఉన్న పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు స్కూలుకు వెళ్తుండగా.. శుభజిత్ ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు.
స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు శుభజిత్‌ను పరిశీలించి అతడు కోమాలోకి వెళ్లాడని నిర్ధారించారు. మరుసటి రోజు అతడి మెదడు పూర్తిగా పని చేయడం ఆగిపోవడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ శుభజిత్ ఆదివారం మృతి చెందాడు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు మానవతా ధృక్పథంతో అవయవ దానం చేశారు. అయితే, అసలు విషయం తెలుసుకున్న ఒడిశా సర్కార్ శుభజిత్ సాబు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. సోమవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో సత్యనగర్ రుద్రభూమిలో శుభజిత్ అంత్యక్రియను నిర్వహించారు.