Viral News: ప్రయాణికులకు శుభవార్త.. విమానం టికెట్ కేవలం రూ.150
మనలో చాలామందికి విమానంలో ప్రయాణించాలి అనే ఆశ ఉంటుంది.
దిశ వెబ్ డెస్క్: మనలో చాలామందికి విమానంలో ప్రయాణించాలి అనే ఆశ ఉంటుంది. అయితే విమానం టికెట్ ధర వేలల్లో ఉంటుంది. పొరుగు రాష్ట్రానికి వెళ్ళాలి అని అనుకున్న టికెట్ ధర కనీసం మూడు వేలు ఉంటుంది. అయితే మన దేశంలోనే కొన్ని చోట్ల విమానం టికెట్ చాల చవకగా దొరుకుతుంది. ఎంత చవకగా అంటే.. కేవలం రూ.150 చెల్లిస్తే చాలు విమానంలో ప్రయాణించ వచ్చు. వివరాల్లోకి వెళ్తే.. డిమాండ్ తక్కువగా ఉన్న చోట కేంద్ర ప్రభుత్వం రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ తీసుకువచ్చింది.
ఈ స్కీమ్ కింద విమానం టికెట్ ధర వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. ఇక అస్సాంలోని లిలాబరి నుండి తేజ్‌పూర్‌కు విమానం టికెట్‌కు బేస్‌ఛార్జీ కేవలం రూ.150 మాత్రమే వసూలు చేస్తున్నారు. అలానే కన్వినీయెన్స్ ఛార్జీ కింద రూ.199 రూపాయలు కట్టాలి. అయితే ఇవి రోజువారీ సేవలు కావు. ఇక రూ.1000 కంటే తక్కువ బేస్ ఛార్జీతో దేశంలో 22 విమాన మార్గాలు ఉన్నాయని.
కాగా టికెట్ బుకింగ్ సమయంలో బేస్ ఛార్జీతోపాటుగా కన్వీనియెన్స్ ఛార్జీ వసూలు చేస్తారు. ఈ సదుపాయాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక దక్షిణాదిలో ఈ రేంజ్ ధరలు బెంగళూరు నుండి సేలం (రూ.525), కొచ్చి నుండి సేలం మార్గాల్లో ఉన్నాయి. గువాహటి నుండి షిల్లాంగ్ మధ్య బేస్ టికెట్ ధర రూ.400గా ఉంది.