నోట్ల కట్టలతో గణపతి విగ్రహం తయారీ.. చూసేందుకు తండోపతండాలుగా వస్తున్న భక్తులు

ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో బొజ్జ గణపయ్య ఉత్సవాలతో పండుగ వాతావరణం నెలకొంది.

Update: 2024-09-13 11:28 GMT

దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో బొజ్జ గణపయ్య ఉత్సవాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన గణపతి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వినాయక మండపాలు వాడవాడలా ఎంతో అద్భుతంగా అలంకరించడం జరుగుతుంది. వినాయక చవితి పండుగ వచ్చిందంటే అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇక వినాయక విషయంలోకి వస్తే ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. వీధి వీధిల్లోని మండపాలలో గణపయ్య కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. చవితి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో కరెన్సీ గణనాథుడు అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. నందిగామ పట్టణంలోని వాసవి బజార్‌లో 42వ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని, రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేసి నిత్య పూజలు అందుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం గణపతి ఉత్సవాల్లో భాగంగా కమిటీ వారు 2 కోట్ల 70 లక్షల నగదుతో కరెన్సీ వినాయకుని వినూత్నమైన రితీలో అందంగా అలంకరించారు. వినాయక మండపం మొత్తం కరెన్సీ నోట్లతో నింపేశారు. గణపయ్యకు వేసే గజమాలల నుంచి మండపంలో టాప్ టూ బాటమ్ మొత్తం కరెన్సీ నోట్ల కట్లతో తయారు చేసిన దండలతో ముస్తాబు చేశారు. ఇక వివిధ కలర్స్‌లోకి మారుతున్న లైట్లు మరింత అట్రాక్షన్‌గా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు క్యూ కడుతున్నారు. మొత్తంగా రూ.2.70 కోట్ల కరెన్సీ కట్టల మధ్య బొజ్జ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.


Similar News