Viral Video: రోబో కుక్క, నిజమైన కుక్క మధ్య మాటాముచ్చట.. నవ్వు ఆపుకోలేరు..
ప్రస్తుతం సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే చాలు AI అప్ డేట్స్ తో నిండిపోతుంది. వంట చేయడం నుంచి యుద్ధంలో పాల్గొనడం వరకు అన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ను భాగం
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే చాలు AI అప్ డేట్స్ తో నిండిపోతుంది. వంట చేయడం నుంచి యుద్ధంలో పాల్గొనడం వరకు అన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ను భాగం చేసేందుకు ట్రై చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధిలో అన్నింటి కంటే ముందుగా దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా మనుషులకు రోబోల గురించి అవగాహన ఉంది. కానీ జంతువులకు లేదు కాబట్టి రోబోను కలిస్తే వాటి రియాక్షన్ ఎలా ఉంటుందనే క్లిపింగ్ వైరల్ అవుతుంది.
సాధారణంగా కుక్కలు మానవులకు అత్యంత విశ్వాసంగా ఉంటాయి. అందుకే హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి. అలాంటప్పుడు డైరెక్ట్ గా కుక్కలనే పెంచుకోవచ్చు. స్పెషల్ ఫోర్స్ లో వినియోగించేందుకు ట్రైనింగ్ కూడా ఇవ్వొచ్చు. కానీ కొంచెం కొత్తగా రోబో కుక్కల్ని తయారు చేస్తున్నాయి కొన్ని దేశాలు. ఈ క్రమంలో ఈ ఆర్టిఫిషియల్ రోబో డాగ్.. నిజమైన కుక్కను కలిస్తే ఎలా ఉంటుందనేది ఈ క్లిపింగ్ చూసి నవ్వుకోవాల్సిందే. ఇక ఇందులో రోబో కుక్కను చూసిన శునకం దగ్గరగా చూసేందుకు అటు వైపుగా వెళ్లింది. కానీ రోబో కదలడంతో తేడాగా ఉందని దూరంగా వెళ్ళిపోయింది. అక్కడే మరో కుక్క ఉండగా దానితో మాట్లాడేందుకు వెళ్లిన రోబో కుక్కను చూసి అది కూడా పారిపోగా.. వాటితో మాట్లాడేందుకు వెంబడించింది రోబో.
Robot dogs are designed to mimic the appearance, behavior, and functions of real dogs. These robots come in various forms, ranging from simple toy-like versions to advanced models equipped with artificial intelligence (AI) and sophisticated sensors.#robots #robotics… pic.twitter.com/Z9WU2djZ8N
— Wevolver (@WevolverApp) October 2, 2024