తెలివైన కోడలు పిల్ల! ఒకేసారి నాలుగు అంటే మజాకా..!

అత్తగారితో తెలివైన కోడలు పిల్ల అనిపించుకోవడానికి కొందరు కోడళ్లు నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ కోడలు నెటిజన్ల తోటి మాత్రం ‘తెలివైన కోడలు పిల్ల’ అని అనిపించుకుంటుంది.

Update: 2024-03-24 10:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అత్తగారితో తెలివైన కోడలు పిల్ల అనిపించుకోవడానికి కొందరు కోడళ్లు నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ కోడలు నెటిజన్ల తోటి మాత్రం ‘తెలివైన కోడలు పిల్ల’ అని అనిపించుకుంటుంది. అయితే చపాతీలు చేయడానికి కొందరూ తిప్పలు పడుతుంటారు. మరోవైపు గుండ్రంగా చపాతీలు రావాలి.. ఎక్కువ చపాతీలు చేయడానికి కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ కోడలు చేసిన పనికి నెటిజన్లు మత్రం ఫిదా అయ్యారు. ‘రాజ్‌పుత్ జోడీ’ అనే ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తాజాగా వీడియో వైరల్ అవుతుంది. ఒకే సారి గబ, గబ నాలుగు చపాతీలు చేసింది ఈ రాజ్‌పుత్ కోడలు. మొదట పిండి తీసుకొని చపాతీ కర్ర‌తో పిండిని పోడుగాటి పెద్ద చపాతి చేసింది. తర్వాత ఓ స్టిల్ టిఫిన్ బాక్స్‌ను తిరగేసి పెద్ద చపాతిపై నోక్కింది. దీంతో అవి గుండ్రంగా ఒకేసారి నాలుగు చపాతీలు అయ్యాయి.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ చపాతీ తయారు విధానానికి ఫిదా అయ్యారు. ఇలా చపాతీలు చేస్తే సింపుల్ గా ఒకే ఎక్కువ చపాతీలు చేయవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకేసారి నాలుగు చపాతీలు అంటే మాటలా..? వర్క్‌ను స్మార్ట్‌గా చేయడం ఆమెను చూసే నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News