Viral Video: వీళ్ల ఫొటోల పిచ్చి తగలెయ్యా.. నడి రోడ్డు మధ్యలో ఫోటో షూట్

ఇన్‌స్టా‌లో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది రోడ్లపై రీల్స్ చేయడం మీరు చూసే ఉంటారు. రద్దీ ఉన్న రోడ్లపై వికృత చేష్టలతో రీల్స్ చేయడంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు.

Update: 2024-06-15 10:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్‌స్టా‌లో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది రోడ్లపై రీల్స్ చేయడం మీరు చూసే ఉంటారు. రద్దీ ఉన్న రోడ్లపై వికృత చేష్టలతో రీల్స్ చేయడంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు. వారు కూడా ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇదే కోవలో వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా వచ్చి చేరినట్టు కన్పిస్తోంది. ఈ మధ్య వెడ్డింగ్ షూట్స్ కాన్సెప్ట్స్ బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ నవతరం పెళ్లి జంటలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. తాజాగా ఓ పెళ్లి కూతురు ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో పెళ్లి కూతురు ఫోటో షూట్ చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ..వారు ఫోటో షూట్ చేయడం కారణంగా.. వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన వైజాగ్‌లో జరిగినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఈ షూట్‌పై నెటజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.  వీళ్ల ఫొటోల పిచ్చి తగలెయ్యా.. ఫోటో అంతా సవ్యంగా జరిగితే ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. లేనిపోని పిచ్చి ప్రయాసలకు పోతే జీవితమే తలకిందులవుతుందని పెళ్లికూతురుకు నెటిజన్లు హితబోద చేస్తున్నారు.

Tags:    

Similar News