AI రోబోతో తమిళిసై ముచ్చట్లు! వినూత్నంగా ఎన్నికల ప్రచారం
దేశంలోని వివిధ పార్టీలు ఎన్నికల క్యాంపెయిన్‌కు సోషల్ మీడియా ఒక వేదికగా ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త టెక్నాలజి ఎన్నికల క్యాంపెయిన్‌కు జతైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని వివిధ పార్టీలు ఎన్నికల క్యాంపెయిన్‌కు సోషల్ మీడియా ఒక వేదికగా ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త టెక్నాలజి ఎన్నికల క్యాంపెయిన్‌కు జతైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈ టెక్నాలజీ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (ఏఐ) రోబోతో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది.
రోబోతో ఆమె తమిళ భాషలో మాట్లాడగా పూర్తి వివరాలతో సహా రోబో తమిళ్‌లో సమాధానం చెబుతన్నది. ఇలా రోబోతో వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. అయితే రోబోలకు ఓటు హక్కు ఉండదని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర్‌రాజన్ బీజేపీలో చేరి.. చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆమె ఎన్నికల ప్రచారంలో తమిళిసై దూసుకపోతున్నది.