Viral news: మనిషి రక్తం రుచి మరిగిన బాక్టీరియా.. నిమిషాల్లోనే..?

సాధారణంగా అంటువ్యాధులు సూక్ష్మక్రిముల కారణంగానే వస్తాయి.

Update: 2024-04-18 06:20 GMT

దిశ వెబ్ డెస్క్: సాధారణంగా అంటువ్యాధులు సూక్ష్మక్రిముల కారణంగానే వస్తాయి. అయితే సూక్ష్మక్రిముల్లో వైరస్, ఫంగస్, బాక్టీరియా అని అనే రకాలు ఉంటాయి. కాగా పరిశోధకులు తాజాగా చేసిన పరిశోధనల్లో బాక్టీరియా వైవిధ్యాన్ని చూసి షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అంటువ్యాధులకు కారణమయ్యే సాల్మొనెల్లా వంటి వివిధ రకాల బాక్టీరియాలు మానవుని రక్తంలో ఉండే రసాయనాల రుచిని గుర్తించ గలుగుతున్నాయి తాజా పరిశోధనల్లో పరిశోధకులు గుర్తించారు.

రక్తంలో ఎర్రరక్త కణాలు (RBC), తెల్లరక్త కణాలు (WBC),  ప్లాస్మా, సీరం ఉంటుంది. కాగా రక్తంలో ఉండే సీరంలో సెరైన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. కాగా సీరంలో ఉండే ఈ సెరైన్ అనే అమైనో యాసిడ్‌కు బాక్టీరియాలు ఆకర్షింపబడి క్షణాల్లో రక్తంలో చేరుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. కాగా బాక్టీరియాల్లో ఆ సామర్ధ్యం ఎలా ఉందో గుర్తిస్తే, ఆ బాక్టీరియాల కారణంగా వచ్చే వ్యాధులను నియంత్రించేందుకు కొత్త ఔషదాలను తాయారు చేయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.  

Tags:    

Similar News