అనంత్ అంబానీ పెళ్లికి చదివింపులు.. ఎవరెంత కట్నం వేశారంటే...

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాహ ఉత్సవాలు ఇంకా పూర్తి కాలేదు. త్వరలో లండన్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసారు. అయితే

Update: 2024-07-16 12:23 GMT

దిశ, సినిమా: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాహ ఉత్సవాలు ఇంకా పూర్తి కాలేదు. త్వరలో లండన్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసారు. అయితే పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు హాజరుకాగా.. వారందరినీ చూసేందుకు కళ్లు కూడా సరిపోలేదు. ఇక శుభ్ ఆశీర్వాద్ వేడుక పూర్తి అయ్యాక అంబానీ ఫ్యామిలీ ఒక్కో సెలబ్రిటీకి పర్సనల్ గా థాంక్స్ చెప్పేందుకు కొన్ని గంటల పాటు స్టేజ్ మీద నిల్చునే ఉండి ఫిదా చేశారు. మొత్తానికి ఈ వివాహం ఖర్చు దాదాపు రూ. 5000 కోట్లు అయిందని అంచనా కాగా మరి కట్నం, చదివింపులు ఎవరెంత వేసి ఉంటారు అనే చర్చ జరుగుతుంది. దీనిపై ఫన్నీ మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.

దేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ గా పరిగణించబడుతున్న ఈ పెళ్లి ఖర్చు అంబానీ ఆస్తిలో కేవలం 0.5% మాత్రమే. కాగా నెటిజన్లు దీన్ని పూర్ మ్యారేజ్ గా పరిగణిస్తున్నారు. అందుకే ఈ పేద పెళ్లికి తమ వంతుగా నెలకు రూ. 349 చెల్లించుకుంటున్నామని అంటున్నారు. అంటే జియో మంత్లీ రీచార్జ్ అన్న మాట. ఇక ఈ పోస్ట్ లపై స్పందిస్తున్న నెటిజన్లు.. తమ తరఫున ఇంత కట్నం అంటే తాము ఇంత చెల్లిస్తున్నామని నెల రీచార్జ్ డబ్బుల గురించి చెప్తున్నారు.


Similar News